Monday, November 25, 2024

Paris Olympics – వినేష్ ఫోగ‌ట్ అప్పీల్ కు ఓకే…ప‌త‌కంపై ఆశలు సజీవం..

పారిస్ ఓలింపిక్స్ – భారత క్రీడాభిమానులకు గుడ్‌ న్యూస్ ఇది.. వినేశ్‌ ఫోగాట్‌ అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అంగీకరించింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకునే అవకాశాలపై మళ్లీ ఆశలు చిగురించాయి. 50 కేజీల రెజ్లింగ్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ డిస్‌ క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. 100 గ్రాముల ఓవర్‌ వెయిట్‌ కారణంగా ఆమెను ఫైనల్‌ ఆడనివ్వకుండా రూల్స్‌ అడ్డుపడ్డాయి. అయితే ఫైనల్‌ వరకు వినేశ్‌ ఫోగాట్‌ ఓవర్‌ వెయిట్‌ లేదు. రెజ్లింగ్‌లో సెమీస్‌ గెలిస్తే మెడల్‌ ఫిక్స్‌ అయినట్టే లెక్క.

కేవలం ఫైనల్‌కు మాత్రమే ఆమె ఉండాల్సినదాని కంటే 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారు. మరి సెమీస్‌ గెలిచినందుకు మెడల్‌ ఇవ్వాలి కదా అని వినేశ్‌ కోర్టు తలుపుతట్టింది.. తాను ఎక్క‌డా ఓవ‌ర్ వెయిట్ లో పోటీలో ఎవ‌రితోనూ త‌ల‌ప‌డ‌లేద‌ని, అలాగే ఫైన‌ల్స్ పోరులో ఓవ‌ర్ వెయిట్ తో పోటీకి మాత్ర‌మే దిగ‌లేద‌ని ఆమె పేర్కొంది.. ఫైన‌ల్స్ లో తాను , ఆడిన ఆడ‌క‌పోయినా స‌రే వెండి ప‌త‌కం పొందేందుకు తాను అర్హురాలిన‌ని పేర్కొంది.. అమె వాద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఆర్బిట్రేష‌న్ రేపు దీనిపై తుది తీర్పుఇవ్వ‌నుంది.. న్యాయం అమె ప‌క్షానే ఉంద‌ని, త‌ప్ప‌కుండా ఆమెకు మెడ‌ల్ వ‌స్తుంద‌ని అంటున్నారు మ‌న ఒలింపిక్ సంఘం అధికారులు .

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement