పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ మరో మెడల్ గెలుచుకుంది. ఇది కూడా షూటింగ్ విభాగంలోనే రావడం విశేషం. భారత యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే భారత్ కు షూటింగ్ లో మూడో మెడల్ ను అందించాడు . పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్లో స్వపినల్ కుసాలే 451.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ప్రపంచ నంబర్ 1 షూటర్‌ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో స్వప్నిల్ కుసాలే భారత్ తరఫున ఒలింపిక్ పతకం సాధించిన 7వ షూటర్‌గా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు ముగ్గురు షూటర్లు భారత్‌కు పతకాలు సాధించారు. మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకోగా, ఆమెతోపాటు సరబ్ జోత్ సింగ్ కూడా పతకాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించి రికార్డు సృష్టించాడు.
క్వార్టర్ ఫైనల్ లో బాక్సర్
71 కిలలో బాక్సింగ్ పోటీలలో మన దేశానికి చెందిన నిషాంత్ దేవ్ క్వార్టర్ ఫైనల్ లో అడుగు పెట్టాడు.
అలాగే బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో నేడు జరిగిన మ్యాచ్ లో ప్రణయ్ గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరాడు.