మిక్స్ డ్ ఈవెంట్ లో కాంస్యం కోసం పోటీ
దక్షిణకొరియా ద్వయంతో 30వ తేదిన పోరు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా కన్పిస్తోంది. షూటింగ్ 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్‌లో మను బాకర్ – సరబ్‌జోత్ సింగ్ జోడీ మూడో స్థానంలో నిలిచింది. కాంస్యం బరిలో చోటు దక్కించుకుంది. క్వాలిఫికేషన్ పోరులో టాప్-4లో నిలిచిన వారు ఫైనల్ పతక పోరుకు అర్హత సాధిస్తారు. ఇందులో మొదటి రెండు స్థానాల్లో ఉన్న వారు స్వర్ణం కోసం పోటీ పడతారు. అక్కడ ఓడిన వారికి రజతం లభిస్తుంది. ఇక, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నవారు కాంస్య పోరు కు తలపడుతారు. సోమవారం జరిగిన ఈ అర్హత మ్యాచ్‌లో మను-సరబ్‌జోత్ జోడీ 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
దీంతో మంగళవారం వారు దక్షిణకొరియా ద్వయంతో కాంస్య పతకం కోసం పోటీ పడనున్నారు. ఇందులో గెలిస్తే భారత్‌కు మరో పతకం దక్కుతుంది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత జోడీ రిథమ్-అర్జున్ చీమా పదో స్థానానికి పరిమితమైంది. ఈ నెల 30వ తేదీన మెడల్ మ్యాచ్ జరుగుతుంది.