Friday, September 20, 2024

Paris Olympics – మ‌ను బాక‌ర్ సంచ‌ల‌నం.. షూటింగ్ లో మ‌రో కాంస్యం

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం
కాంస్యం సాధించిన మనుబాకర్‌, సరబ్‌జోత్ జోడీ
10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ పోరులో కాంస్యం
కొరియన్ జోడీపై 16-10 తేడాతో గెలుపు
ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలతో మనుబాకర్‌ రికార్డు

ఇప్ప‌టికే భార‌త్ కు ఒలింపిక్స్ లో తొలిప‌త‌కం అందించిన షూట‌ర్ మను బాక‌ర్ స‌రికొత్త‌ చ‌రిత్ర సృష్టించింది.. షూటింగ్ లో మ‌న‌దేశానికి మ‌రో కాంస్య ప‌త‌కం అందించింది.. నేడు జ‌రిగిన 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో మను-సరబ్‌జోత్ బరిలోకి దిగి కొరియ‌న్ జోడిని చిత్తు చేసింది.. కాంస్య ప‌త‌కం కోసం జ‌రిగిన ఈ పోటీలో కొరియన్ జోడీపై 16-10 తేడాతో గెలుపు సాధించింది మ‌న భార‌త జోడి.. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయులెవ‌రూ కూడా ఒకే ఒలింపిక్స్ లో రెండు ప‌త‌కాలు ఒకే ఈవెంట్ లో గెలిచిన దాఖలాలు లేవు.. షూటింగ్ విభాగంలో ఏకంగా రెండు ప‌త‌కాలు భార‌త్ కు సాధించిన షూట‌ర్ గా మ‌ను బాక‌ర్ నిలిచింది.

- Advertisement -

ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన మూడో క్రీడాకారిణి

ఇంతకుముందు సుశీల్ కుమార్ 2008, 2012 ఒలింపిక్స్ లో, పీవీ సింధు 2016, 2020 ఒలింపిక్స్ లో రెండేసి పతకాలు సాధించారు. ఐతే ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు పొందిన మొదటి భారతీయులుగా మను బాకర్ చరిత్ర సృష్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement