Friday, September 6, 2024

Paris Olympics | విశ్వ క్రీడల మహా సమరానికి పారిస్ సిద్ధం..

విశ్వ క్రీడల మహాసమరం పారిస్‌ ఒలింపిక్స్‌ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు పారిస్ లోని ప్ర‌ధాన క్రీడా వేదిక‌లో ప్రారంభ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు… 142 దేశాల‌కు చెందిన అథ్లెట్లు ఈ వేడుక‌ల‌లో పాల్గొన‌నున్నారు… ఇక ఎన్నో ఆశలు, భారీ అంచనాలతో భార త క్రీడాకారుల బృందం పారిస్‌ నగరంలోకి అడుగు పెట్టింది. ఈసారి విశ్వసమరానికి భారత్‌ నుంచి 117 మంది అథ్లెట్లు అర్హత సాధించారు. వీరిపై కోట్లాది మంది భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

గత ఒలింపిక్స్‌ల కంటే ఈసారి తమ అథ్లెట్లు అధిక పతకాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. గత టోక్యో ఒలిం పిక్స్‌లో భారత్‌ నుంచి 18 క్రీడాంశాల్లో మొత్తం 122 మంది అథ్లెట్లు పాల్గొనగా అందులో భారత్‌కు 7 పత కాలు వచ్చాయి. స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణ పతకం గెలిచి కొత్త చరిత్ర లిఖించాడు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించి సంచ లనం సృష్టించాడు.

అలాగే భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ పతకాన్ని సాధించి రికార్డు నెలకొల్పింది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ తెలుగు తేజం పీవీ సింధు వరుసగా రెండో ఒలింపిక్స్‌ పతకాన్ని కైవసం చేసుకుని సత్తా చాటుకుంది. ఇక మొత్తంగా టోక్యోలో భారత్‌ ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలతో మొత్తం 7 పతకాలు గెలుచుకుంది.

భారత్‌కు లభించిన ఏకైక గోల్డ్‌ను జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సాధించాడు. స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరా బాయి చాను, ప్రముఖ రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా సిల్వర్‌ మెడల్స్‌ సొంతం చేసుకున్నారు. పీవీ సింధు (బ్యాడ్మింటన్‌), లవ్లీనా బొర్గొహెన్‌ (రెజ్లి ంగ్‌), బజరంగ్‌ పూనియా (రెజ్లింగ్‌)లతో పాటు భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది.

కాగా, ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో మన పతకాల సంఖ్య పెరగాలని 140 కోట్ల మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా రు. అలాగే గత ఒలింపిక్స్‌ల కంటే ఈసారి భారత బృందం చాలా పటిష్టంగా ఉం ది. ఆర్చరీ, షూటింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టుతు న్నారు. గత కొంత కాలంగా ఈ క్రీడల్లో భారత ఆటగాళ్లు అంతర్జాతీయ మెరుగైన ప్రదర్శనలతో సత్తా చాటుతున్నారు. దాంతో పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఈ విభాగాల్లో పతకాలు రావడం ఖాయమనిపిస్తోంది.

- Advertisement -

నీరజ్‌, సింధు ఈసారి కూడా..

గత టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత స్టార్లు నీరజ్‌ చోప్రా, పీవీ సింధు ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ అదే జోరు కొనసా గించాలని పట్టుదలతో ఉన్నారు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో స్టార్‌ జావెలిన్‌ త్రో ప్లేయర్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణంతో మెరిసాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నో ప్రపంచ వేదికలపై అదే జోరు కొనసాగిస్తూ మరెన్నో పసిడిలు సొంతం చేసుకున్నాడు.

ఇప్పుడు వరుసగా ఒలింపిక్స్‌ గోల్డ్‌తో చరిత్ర సృష్టించాలని ఆతృతగా ఉన్నాడు. భారత బ్యాడ్మింటన్‌ క్వీన్‌ తెలుగు తేజం పీవీ సింధు వరుసగా చివరి రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించింది. ఇప్పుడు హ్యట్రిక్‌పై గురిపెట్టింది. ఈసారి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ కూడా స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

ప‌త‌కాల‌పైనే షూటర్ల గురి

సీనియర్ల తో పాటు ఎందరో యువ షూటర్లు భారత షూటింగ్‌ బృం దంలో చేరా రు. షూటింగ్‌లో పతకాల పంట పండిస్తున్నా రు. అసా ధారణ ప్రదర్శనలతో ఆసియా క్రీడాల్లో, ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఎన్నో పతకాలు అందిం చారు. గత కొన్నేళ్లుగా ప్రపంచ టోర్నీలో అదరగొడుతున్న భారత స్టార్‌ షూటర్‌ మను బాకర్‌పై ఈసారి భారీ అంచ నాలు ఉన్నాయి. ఈమె 10 మీటర్లు, 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో పో టీ పడుతూ స్వర్ణలపై గురిపెట్టింది.

మరోవైపు హైదరాబాదీ యువ సంచలనం ఈషా సింగ్‌ 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో పతకం సాధించ డం ఖాయమనిపిస్తోంది. అలాగే రిథమ్‌ సాంగ్వాన్‌, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌, సరబ్‌జ్యోత్‌ సింగ్‌లకు కూడా పతకాలు కొలగొట్టే సత్తా ఉండటంతో ఈసారి షూటింగ్‌లో భారత్‌కు కనీసం 5 పతకాలు వస్తాయని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

ఆర్చరీలో పతకాలు కొలగొట్టాలి..

ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి పటిష్టమైన ఆర్చరీ బృందం బరిలోకి దిగుతోంది. తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌, సీనియర్‌ మహిళా ఆర్చర్‌ దీపిక కు మారి, భజన్‌ కౌర్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరు పతకాల గురి పెట్టడం ఖాయమనిపిస్తోంది.

పతకమే లక్ష్యంగా మీరాబాయి చాను, వినేశ్‌ ఫొగాట్‌..

భారత స్టార్‌ మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను ఈసారి కూడా పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకున్న చాను ఇప్పుడు పారిస్‌ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ కొలగొట్టాలని చూస్తోంది. మరోవై పు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ కూడా పతకమే లక్ష్యంగా రింగ్‌లోకి అడుగుపెట్టనుంది.

అంతర్జాతీయ వేదికల్లో ఎన్నో పతకాలు సాధించిన వినేశ్‌ ఈసారి ఒలింపిక్స్‌ పతకాన్ని కూడా ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఇక బాక్సింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌, గోల్ఫ్‌, అథ్లెటిక్స్‌ తదితర క్రీడల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement