ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్‌లో జరిగిన ఫోర్ నేషన్స్ పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్‌లో.. ప్రపంచ నంబర్ 1 పురుషుల డబుల్స్ జోడీ అయిన ప్రమోద్ భగత్- సుకాంత్ కదమ్ SL3-SL4 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పురుషుల డబుల్స్‌లో భగత్-కదమ్ జోడీ 21-17 21-17తో దీప్ రంజన్ బిసోయ్-మనోజ్ సర్కార్ జంటను ఓడించి స్వర్ణం సాధించారు.
ఇక సింగిల్స్ SL3 విభాగంలో రజతంతో పాటు.. మనీషా రాందాస్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ SL3- SU5 విభాగంలో కూడా ఒక రజతం సాధించాడు భగత్. అయితే సింగిల్స్ SL4 విభాగంలో ఇండోనేషియాకు చెందిన ఫ్రెడీ సెటియావాన్‌తో 21-17 15-21 16-21 తేడాతో ఓడిపోయి సింగిల్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు సుకాంత్ కదమ్.
ఇతర భారతీయ విజేతలు..
SH6 విభాగంలో స్వర్ణం సాధించిన కృష్ణ.
మానసి జోషి-తులసిమతి మురుగేశన్ మహిళల డబుల్స్ SL3- SU5 లో స్వర్ణం సాధించారు.
మహిళల SH6 విభాగంలో నిత్యాశ్రీ రజతం సాధించింది.
పురుషుల SL3-SL4లో దీప్ రంజన్ బిసోయ్, మనోజ్ సర్కార్ రజతం సాధించగా, నితేశ్, తరుణ్ కాంస్యం సాధించారు.
SL3 విభాగంలో కుమార్ నితేష్ కాంస్యం సాధించాడు.
మహిళల SL3 విభాగంలో మానసి జోషి, మన్‌దీప్ కౌర్‌లు కాంస్యం గెలుచుకున్నారు.
మిక్స్‌డ్ డబుల్స్ SU5 విభాగంలో చిరాగ్ బరేతా-రాజ్‌కుమార్ రజతం సాధించారు.
మహిళల SU5 విభాగంలో రాందాస్ కాంస్యం సాధించాడు.
మిక్స్‌డ్ డబుల్స్ SH6 విభాగంలో కృష్ణ-నిత్య శ్రీ జంట కాంస్యం సాధించింది.
మిక్స్‌డ్ డబుల్స్ WH1-WH2 ఈవెంట్‌లో ప్రేమ్ కుమార్ అలె కాంస్యం సాధించారు.