Thursday, October 31, 2024

పారా అథ్లెట్‌ వినోద్‌కుమార్‌పై రెండేళ్లు నిషేధం..

టోక్యో పారాలింపిక్స్‌-2020లో డిస్కస్‌ త్రోలో కాంస్యం గెలిచినట్టే గెలిచి పతకాన్ని చేజార్చుకున్న భారత పారా అథ్లెట్‌ వినోద్‌ కుమార్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. రెండేళ్లపాటు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా బీఏసీ నిషేధం విధించింది. పారాలింపిక్స్‌లో డిస్కస్‌ త్రో ఈవెంట్‌ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2023 వరకు వినోద్‌కుమార్‌పైనిషేధం కొనసాగనుంది.

ఉద్దేశ్యపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించి పారా అథ్లెట్‌గా క్లాసిఫికేషన్‌లో పొందుపరిచిన వివరాలకు భిన్నంగా వినోద్‌కుమార్‌ వ్యవహరించాడని బీఏసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ క్లాసిఫికేషన్‌ రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ క్రమశిక్షణా రాహిత్యం కింద అతడిపై చర్యలు చేపట్టినట్లు వివరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement