ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్‌జెయింట్స్ తమ తదుపరి కెప్టెన్‌గా ఇండియన్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను నియమించింది. లక్నో యాజమాన్యం, మెగా వేలం రూ.27 కోట్ల భారీ ధరకు పంత్‌ను కొనుగోలు చేసింది. కనిష్ట ధర రూ.2 కోట్లతో వేలంలోకి ప్రవేశించిన పంత్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా అవతరించడంతో అంచనాలను మించిపోయాడు.
2016లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన పంత్‌కి ఇది రెండో ఫ్రాంచైజీ. పంత్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా భాద్యతలు వ్యవహరించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు పంత్ 111 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలతో సహా 3,284 పరుగులు చేశాడు.