టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ దూకుడు కొంత తగ్గించుకోవాలి. ఆటలో నిర్లక్ష్యానికి స్థానం లేదు. మంచి టాలెంట్ ఉన్నా.. దాన్ని వినియోగించుకోవడంలో విఫలం అవుతున్నాడు. నిర్లక్ష్యపు షాట్స్‌తో ఔట్ అవుతున్నాడు. కాస్త దూకుడు తగ్గించి ఓపికగా ఆడితే జట్టుకు ఎంతో మేలు చేకూర్చినట్టు అవుతుంది. పంత్ మంచి సత్తా ఉన్న ఆటగాడు. కానీ గత కొన్ని రోజులుగా అతని ఆటతీరు కారణంగా.. అభిప్రాయం మారిపోతున్నది. ఓ మ్యాచ్‌లో బాగా ఆడితే.. మరో మ్యాచ్‌లో దారుణంగా విఫలం అవుతాడు. పంత్ బ్యాటింగ్‌లో నిలకడ కొరవడింది.
ఆసీస్ పర్యటనలో బాగానే ఆడాడు. సిడ్నీ టెస్టులో 96, బ్రిస్బేన్ టెస్టులో 89 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి హిట్టింగ్ చేస్తానంటే కుదరదు. పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. ఈ విషయంలో కోచ్ ద్రావిడ్ స్పందించాలి. పంత్‌తో ప్రత్యేకంగా మాట్లాడాలి. నాల్గో స్థానంలో వచ్చిన ఆటగాడు జట్టుకు ఎంతో కీలకం అనేది పంత్ గుర్తుపెట్టుకోవాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..