లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది . లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఇంకా మూడు బంతులు వుండగానే చ్చేదించింది పంజాబ్ కింగ్స్ . వరుస ఓటముల నుంచి తేరుకొని మూడో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించింది. ఆల్‌రౌండర్ సికిందర్ రజా(57, 41 బంతులు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. షారుక్ ఖాన్(19)చివర్లో దంచి కొట్టడంతో పంజాబ్ మరో మూడు బంతులు ఉండగానే మ్యాచ్ గెలిచింది.
160 లక్ష్య ఛేదనలో యుధ్‌విర్ సింగ్ దెబ్బకు పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. వరుస ఓవర్లలో అతను ఓపెనర్ అథర్వ తైడే (0), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (4)ను ఔట్ చేశాడు. ధాటిగా ఆడుతున్నమాథ్యూ షార్ట్(34) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. సామ్ కరణ్(6) విఫలమయ్యాడు. అప్పటికి పంజాబ్ స్కోర్ 112/6. ఆ తర్వాత సికిందర్ రజా(57), షారుక్ ఖాన్(19) జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్యా, కే గౌతమ్, తలా ఒక వికెట్ తీశారు.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 159 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(74) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడికి కృనాల్ పాండ్యా(18), స్టోయినిస్(15) సహకారం అందించారు. 53 రన్స్ వద్ద ఆ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా(0)ను సికిందర్ రజా ఎల్బీగా ఔట్ చేశాడు. గత మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించిన నికోలస్ పూరన్ డకౌటయ్యాడు. స్టోయినిస్ ఉన్నంత సేపు చెలరేగి ఆడాడు. 11 బంతుల్లో రెండు సిక్స్‌లతో 15 రన్స్ చేశాడు. దాంతో, లక్నో స్కోర్ 180 దాటేలా కనిపించింది. కానీ, సామ్ కరన్ మూడు వికెట్లతో లక్నోను దెబ్బకొట్టాడు. రబాడ రెండు, హర్‌ప్రీత్ బ్రార్, సికిందర్ రజా, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు..