Tuesday, November 26, 2024

Boxing | ఒలింపిక్‌ రేసులోకి పంగల్‌…

భారత యువ బాక్సర్‌ అమిత్‌ పంగల్‌ విశ్వ వేదికపై తన పంచ్‌ వవర్‌ చూపించాడు. కీలక పోరులో చైనా బాక్సర్‌ను చిత్తుగా ఓడించి 51 కిలోల విభాగంలో ప్యారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు ఖాయం చేసుకున్నాడు. తద్వారా భారత్‌ నుంచి విశ్వక్రీడలకు అర్హత సాధించిన ఐదో బాక్సర్‌గా పంగల్‌ రికార్డు నెలకొల్పాడు.

ఆదివారం జరిగిన క్వాలిఫయర్స్‌ క్వార్టర్స్‌లో అమిత్‌ రెచ్చిపోయాడు. చైనాకు చెందిన లూ చౌంగ్‌పై పంచ్‌ల వర్షం కురిపించి 5-0తో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లాడు. దాంతో, నిశాత్‌ దేవ్‌ తర్వాత ఒలింపిక్స్‌ బెర్తు ఖాయం చేసుకున్న రెండో పురుష బాక్సర్‌గా అమిత్‌ నిలిచాడు.

ప్రస్తుతానికి పంగల్‌తో కలిపి ఐదుగురు బాక్సర్లు ఒలింపిక్స్‌ పోటీలకు అర్హత సాధించారు. నిఖత్‌ జరీన్‌ (50 కిలోలు), లవ్లినా బొర్గొహన్‌ (75 కిలోలు), ప్రీతి పవార్‌(54 కిలోలు), నిశాంత్‌ దేవ్‌ (71 కిలోలు), అమిత్‌ పంగల్‌(51 కేజీ) లు విశ్వ క్రీడల్లో పతకంపై గురి పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement