టీ-10 లీగ్‌లో భాగంగా రాయల్స్- పేట్రియాట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అరుదైన రికార్డు నమోదైంది. 6 బంతుల్లో 6 సిక్స్‌లు.. 19 బంతుల్లో 83 పరుగులుచేసి పేట్రియాట్స్ జట్టు క్రీడాకారుడు కృష్ణపాండే చరిత్ర సృష్టించాడు. టాస్ గెలిచిన రాయల్స్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి 158 పరుగులు చేసింది. అనంతరం పేట్రియాట్స్ 159 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించగా, ఆదిలోనే ఓపెనర్లను జారవిడుచుకుంది. ఈ దశలో బరిలోకి దిగిన కృష్ణపాండే ఆకాశమే హద్దులో చెలరేగిపోయాడు. మైదానం నలువైపులా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కృష్ణపాండే ఖాతాలో ఆరు బంతులకు ఆరు సిక్సర్ల రికార్డు నమోదైంది. 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి.. టీ 10 చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా కృష్ణ పాండే నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతులు మాత్రమే ఆడిన కృష్ణ పాండే ఏకంగా 12 సిక్సర్లు బాదాడు.
మొత్తంగా 83 పరుగులు చేశాడు. అయినప్పటికీ పేట్రియాట్స్ జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2007 టీ-29 వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. చెలరేగిపోయాడు. అతడి తర్వాత పొలార్డ్ ఆ అరుదైన ఫీట్ సాధించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.