Friday, November 22, 2024

సచిన్ ఎక్కడైనా సిక్సర్ కొట్టగలడు:అక్రమ్

కోవిడ్ తో హాస్పిటల్ లో చేరిన సచిన్ పై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ అన్నాడు. సచిన్ నువ్వు కరోనా తోను సిక్స్ కొట్టగలవని ట్వీట్ చేశాడు. 16 ఏళ్ల వయసులోను ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కున్న నువ్వు ఇప్పుడు కరోనాతో పోరాటం చేయడం పెద్ద విషయం కాదన్నారు. ‌కరోనా సోకిన ఆరు రోజుల త‌ర్వాత తాను వైద్య సిబ్బంది స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు స‌చిన్ చేసిన ట్వీట్‌కు అక్ర‌మ్ బ‌దులిచ్చాడు. నువ్వు కేవ‌లం 16 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ప్ర‌పంచ అత్యుత్త‌మ బౌల‌ర్ల‌ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నావు. అలాగే నువ్వు క‌చ్చితంగా కొవిడ్‌ను సిక్స్ కొట్ట‌గ‌ల‌వు. త్వ‌ర‌గా కోలుకో మాస్ట‌ర్‌. ఇండియా 2011 వ‌రల్డ్‌క‌ప్ విజ‌యాన్ని నువ్వు డాక్ట‌ర్లు, ఆసుపత్రి సిబ్బందితో జ‌రుపుకుంటావ‌ని ఆశిస్తున్నా. నాకు కూడా ఓ ఫొటో పంపించు అని అక్ర‌మ్ ట్వీట్ చేశాడు. ఇక అప్పట్లో ఇండియా-పాక్ మ్యాచ్ జరిగిన ప్రతిసారి అక్రమ్-సచిన్ పోరును చూసేందుకు అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. వీరిద్దరిలో ఎవరిది పై చేయి సాదిస్తారోనని ప్రతిసారి అంచనాలు కట్టేవారు. కాని ఎక్కువసార్లు సచినే అక్రమ బౌలింగ్ ను చితక్కొట్టేవాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement