టీ20 ప్రపంచకప్ 2024 బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన వివరాలను పీసీబీ శుక్రవారం వెల్లడించింది. అందరు ఊహించినట్లుగానే బాబర్ ఆజామ్ సారథ్యంలోనే పాకిస్థాన్ ఈ మెగా టోర్నీ ఆడనుంది. అయితే వైస్ కెప్టెన్ ఎవరా? అనే విషయంపై పీసీబీ క్లారిటీ ఇవ్వలేదు.
జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో పాల్గొనే దేశాలు.. తమ జట్లను ప్రకటించాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డే తమ జట్టును ఆలస్యంగా ప్రకటించింది. తమ ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతుండటంతో టైమ్ తీసుకుంది.
పాకిస్థాన్ స్టార్ పేసర్ హ్యారీస్ రౌఫ్‌కు అవకాశం దక్కింది. భుజ గాయంతో సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరంగా ఉన్న అతను టీ20 ప్రపంచకప్‌తో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. చివరి సారిగా అతను ఫిబ్రవరిలో పాక్ తరఫున బరిలోకి దిగాడు. అయితే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన హసన్ అలీ, మహమ్మద్ ఇర్ఫాన్, సల్మాన్ అలీ అఘాలకు మాత్రం టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు.
బాబర్ ఆజామ్, అబ్రర్ అహ్మద్, ఆజమ్ ఖాన్, ఫకార్ జమాన్, హారీస్ రౌఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, మహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహమ్మద్ అమీర్, మహమ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ ఆయుబ్, షాదాబ్ ఖాన్, షాహిన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్లు అవకాశం దక్కించుకున్నారు. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న మహమ్మద్ అమీర్‌కు కూడా చోటు దక్కింది.
ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6న డల్లాస్ వేదికగా అమెరికాతో తలపడనుంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్.. భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. జూన్ 11న కెనడాతో న్యూయార్క్ వేదికగా, జూన్ 16న ఐర్లాండ్‌తో ఫ్లోరిడా వేదికగా పాకిస్థాన్ తమ లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.
పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ జట్టు:
బాబర్ ఆజామ్(కెప్టెన్), అబ్రర్ అహ్మద్, ఆజమ్ ఖాన్, ఫకార్ జమాన్, హారీస్ రౌఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, మహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహమ్మద్ అమీర్, మహమ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ ఆయుబ్, షాదాబ్ ఖాన్, షాహిన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్