Saturday, November 23, 2024

క‌రోనా బారినప‌డ్డ పాకిస్తాన్ ప్లేయ‌ర్, పాకిస్థాన్ – ఆస్ట్రేలియా రెండో టెస్టుకు దూరం..

పాకిస్థాన్ – ఆస్ట్రేలియా మధ్య చారిత్రాత్మక టెస్టు సిరీస్ ప్రారంభమై తొలి టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి రెండో టెస్టుపై పడింది. కానీ.. ఆ జట్టులోని మరొక ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. రావల్పిండిలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసిన ఒక రోజు తర్వాత టీమ్ ఆల్-రౌండర్ ఫహీమ్ అష్రఫ్ కు కరోనా టెస్టులో పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత అతను క్వారంటైన్‌లో ఉన్నాడు. దీంతో రెండో టెస్టు నుంచి మేనేజ్‌మెంట్ తప్పించింది.

5 రోజులు క్వారంటైన్..

ఈ నిబంధన ప్రకారం ఫహీమ్ అష్రఫ్ ప్రస్తుతం 5 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది, నెగెటివ్ వచ్చిన తర్వాతే అతడిని ఐసోలేషన్ నుంచి బయటకు తీసుకువ‌స్తామ‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఫహీమ్ స్థానంలో ఇంకా ఏ ఆటగాడిని చేర్చుకోలేదని, అవసరమైతే మాత్రమే ఫహీమ్‌ను భర్తీ చేస్తామని పాకిస్థాన్ బోర్డు పేర్కొంది. మార్చి 12 నుంచి కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement