దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్‌లో ఇవ్వాల ఇండియా, పాకిస్తాన్ టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండో ఓవర్లోనే పాకిస్తాన్ ఫస్ట్ వికెట్ పడగొట్టుకుంది. అయితే తొలుత రెండో బాల్కే మహ్మద్ రిజ్వాన్ ఎల్బీడబ్ల్యూగా అవుటిచ్చినా.. బ్యాటింగ్ రివ్యూలో అది తప్పని తేలింది. ఇక.. కొంచెం స్పీడు పెంచిన పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ ఫోర్లతో ఆకట్టుకుండగా భువనేశ్వర్ వెన్నువిరిచాడు. నిప్పులు చిమ్ముతూ వెళ్లిన బంతి బాబర్ ఆజమ్‌ని అడ్డంగా బుక్ చేసింది. క్యాచ్‌గా ఆజమ్ పెవిలియన్ చేరాడు. తొమ్మిది బంతుల్లో 10 పరుగులు చేసిన బాబర్ పాక్ 15 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
ప్రస్తుతం నాలుగు ఓవర్లకు 27 పరుగులు చేసిన పాకిస్తాన్ ఒక వికెట్ పోగొట్టుకుంది. క్రీజులో రిజ్వాన్, ఫకర్ జవాన్ ఉన్నారు.
- Advertisement -