పాక్ కెప్టెన్ బాబర్ అజాం వన్ డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు పూర్తిచేశాడు. గతంలో టీం ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఈ ఘనతను సాధించాడు. 17 ఇన్నింగ్స్‌లో విరాట్ సొంతం చేసుకోగా తాజాగా బాబర్….13 ఇన్నింగ్స్‌లోనే పూర్తిచేసి అందరినీ అబ్బురపరిచాడు. వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 103 పరుగులు సాధించి ఈ సరికొత్త రికార్డను సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ 18 ఇన్నింగ్స్‌లలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక కేన్ విలియమ్స్ 20 ఇన్నింగ్స్, అలిస్టర్ కుక్ 21 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచారు. మరోవైపు బాబర్ ఈ శతకంతో వన్డేల్లో రెండోసారి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టిన క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో 2016లో ఇదే జట్టుపై 120, 123,117 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 305/8 మేర భారీ స్కోరు సాధించింది. పాకిస్తాన్ ఇన్ని ఇన్నింగ్స్ సాధించినా ఆ ఘనత బాబర్‌కే దక్కుతుంది. ఇమామ్n ఉల్ హక్ , మహ్మద్ రిజ్వాన్ అండదండగా నిలిచారు. 23 బాల్స్‌కు 41 పరుగులు సాధించిన ఖుష్ దిల్ షా కడదాకా క్రీజులో ఉండడం కూడా కలిసొచ్చింది. పాకిస్తాన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ని పరుగులు చేయడం ఇదే తొలిసారి. కేవలం 13 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను బాబర్ దక్కించుకున్నాడు. బాబర్ అసాధారణ ప్రజ్ఞాపాటవాలకు మురి సిపోయిన పాక్ క్రికెట్ బోర్డు… ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రేట్ చేసుకుంది.
అద్బుతమైన క్యాచ్ పట్టిన వైస్ కెప్టెన్..
విండీస్‌తో మ్యాచ్ సందర్భంగా పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ అద్భుతం చేశాడు. ఈ క్యాచ్ 154 పరుగులు వద్ద ఆగిపోయిన పొరుగుదేశ జట్టు స్కోరును ముందుకు పరుగులు తీయించింది. బ్యాట్ అంచుకు తగిలిన బాల్ షాదాబ్ వైపు వె ళుతుండగా ఎడమవైపునకు తిరిగిన షాదాబ్ ఒంటిచేత్తోనే పట్టేశాడు. చివరికి పాక్ ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇంకానాలుగు బంతులు మిగిలి ఉండగానే 306 పరుగులు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.