Saturday, November 23, 2024

206 పరుగులకే ఆలౌట్‌ అయిన పాక్‌.. చెలరేగిపోయిన నెదర్లాండ్స్‌ బౌలర్లు

నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మూడో వన్డే(రీ షెడ్యూల్డ్‌ మ్యాచ్‌)లో పాకిస్థాన్‌ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 206 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. తొలి రెండు వన్డేల్లోనూ పరాజయం పాలైన నెదర్లాండ్స్‌ ఈ మ్యాచ్‌లో బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగి పాకిస్థాన్‌ను నిప్పు చెరిగే బంతులతో వణికించింది. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఈ మ్యాచ్‌లో 91 పరుగులు చేసినప్పటికీ జట్టు మాత్రం 206 పరుగులకు ఆలౌట్‌ కావడం చూస్తుంటే నెదర్లాండ్‌ బౌలర్లు ఎంతలా చెలరేగిపోయారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఒక్కడే 91 పరుగులతో రాణించడంతో పాకిస్తాన్‌ ఈ మేరకు స్కోరు నమోదు చేయగలిగింది. రీ షెడ్యూల్డ్‌ వన్డే సిరీస్‌ నేపథ్యంలో పాకిస్తాన్‌ నెదర్లాండ్‌లో పర్యటిస్తోంది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ అద్భుత పోరాటం కనిపించింది. ఆఖరి వరకు పోరాడి 16 పరుగులతో ఓటమిపాలైంది. ఇక రెండో వన్డేలో మాత్రం పాక్‌ జట్టు.. ఆతిథ్య

జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. 168 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా ఆజం అవుటైన తర్వాత మిగతా నాలుగు వికెట్లు టపటపా రాలిపోయాయి. ఫలితంగా 49.4 ఓవర్లలో 206 పరుగులకే పాకిస్తాన్‌ చాప చుట్టేసింది. బాబర్‌ తర్వాత నవాజ్‌ చేసిన 27 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన నెదర్లాండ్స్‌ 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 20 పరుగులు చేసింది. ఓపెనర్లు పేలవం ఈ క్రమంలో రోటర్‌ డామ్‌ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే ఆతిథ్య జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు షఫీక్‌, షఖర్‌ జమాన్‌ వరుసగా 2,26 పరుగులు (43 బంతుల్లో) చేసి నిష్క్రమించారు.

సెంచరీ కొట్టేవాడు..

ఇలాంటిపరిస్థితుల్లో వన్‌ డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ బాబర్‌ ఆజం క్రీజులో పాతుకుపోయాడు. 125 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. కాని 43వ ఓవర్‌ నాలుగో బంతికి ఆర్యన్‌ దత్‌ అద్బుత బంతితో ఆజంను బోల్తా కొట్టించాడు. ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టి పెవిలియన్‌కు పంపాడు. దీంతో సెంచరీ చేసే అవకాశం పాక్‌ కెప్టెన్‌కు చేజారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement