వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్- పాకిస్తాన్ పోటీకి దిగాయి. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే రెండు జట్లకూ ఇవాళ్టి మ్యాచ్ కీలకంగా మారింది. ఈ క్రమంలో చిన్నస్వామి స్టేడియంలో పైచేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు విజృంభించారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి వచ్చీ రాగానే అరుదైన రికార్డుతో మెరిశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచకప్ టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రచిన్ రవీంద్ర ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. 94 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ తో 108 పరుగులు చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు చేసి సెంచరీ చేజార్చుకున్నాడు. ఇఫ్తికార్ అహ్మద్ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి.. బౌండరీ వద్ద ఫఖర్ జమాన్ చేతికి చిక్కాడు. అలాగే గ్లెన్ ఫిలిప్స్ 41 పరుగులు, చాంప్ మాన్ 39 పరుగులు, డెవాన్ కాన్వే 35 పరుగులతో పాక్ కు భారీ టార్గెట్ ను ఇచ్చారు. న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. దీంతో పాక్ జట్టు ఈ మ్యాచ్ లో గెలుపొందాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 402 పరుగులు చేయాల్సి ఉంది.