స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను పాకిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో పాక్ 9 వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై ఘన విజయం సాధించింది. పాక్ గెలుపులో ఆ జట్టు స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కోల్పోయిన 20 వికెట్లను పాక్ స్పిన్నర్లే పడగొట్టారు. పాక్ స్పిన్నర్లలో సాజిద్ ఖాన్ 10 వికెట్లు పడగొట్టగా.. నౌమన్ అలీ 9, జహీద్ మెహమూద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (52), జేమీ స్మిత్ (89) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ 6, నౌమన్ అలీ 3, జహీద్ మెహమూద్ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (52), జేమీ స్మిత్ (89) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ 6, నౌమన్ అలీ 3, జహీద్ మెహమూద్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం బరిలోకి దిగిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ సూపర్ సెంచరీతో (134) పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో నౌమన్ అలీ (45), సాజిద్ ఖాన్ (48 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ 4, షోయబ్ బషీర్ 3, అట్కిన్సన్ 2, జాక్ లీచ్ ఓ వికెట్ పడగొట్టారు.
77 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. నౌమన్ అలీ (6/42), సాజిద్ ఖాన్ (4/69) దెబ్బకు 112 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 36 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 3.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.