Thursday, October 24, 2024

PAK vs ENG | పాక్ దూకుడు.. ఇంగ్లాండుకు కళ్లెం

సొంతగ‌డ్డ‌పై ఇంగ్లండ్‌తో జరుగుతున్న‌ సిరీస్-నిర్ణయాత్మక మూడో టెస్టులో పాకిస్థాన్ బౌల‌ర్లు అద‌ర‌గొట్టారు. ఇంగ్లండ్ దూకుడుకు క‌ళ్లెం వేస్తూ… భారీ ప‌రుగులు చేయ‌కుండా అడ్డుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాటర్ల‌లో జామీ స్మిత్ (89), బెన్ డకెట్ (52) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. జాక్ క్రాలీ (29), గుస్ అట్కిన్సన్ (39) ప‌రువాలేద‌నిపించారు.

విధ్వంస‌క‌ర బ్యాట‌ర్లు ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ క‌నీసం 10 పరుగులు కూడా చేయ‌కుండానే పెవిలియ‌న్ చేరారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 68.2 ఓవ‌ర్ల‌లో 267 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ బౌల‌ర్ల‌లో సాజిద్ ఖాన్ 6 వికెట్ల‌తో చెల‌రేగాడు. నోమన్ అలీ మూడు వికెట్లు తీయ‌గా.. జాహిద్ మహమూద్ ఒక వికెట్ ద‌క్కించుకున్నాడు.

అనంత‌రం, త‌మ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ 23 ఓవ‌ర్ల‌లో 73 ప‌రుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం క్రీజ్ లో కెప్టెన్ షాన్ మసూద్ (16), సౌద్ షకీల్ (16) ఉన్నారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జాక్ లీచ్, గుస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్ త‌లో వికెట్ ద‌క్కించుకున్నారు.

మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ :

ఇంగ్లండ్ 267 ఆలౌట్
పాక్ 73/3

Advertisement

తాజా వార్తలు

Advertisement