సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్-నిర్ణయాత్మక మూడో టెస్టులో పాకిస్థాన్ అద్బుతంగా పోరాడుతుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. తొలుత ఇంగ్లండ్ దూకుడుకు కళ్లెం వేస్తూ… బౌలర్లు అదరగొట్టారు. అనంతరం బ్యాటింగ్ లోనూ పాకిస్థాన్ చెలరేగింది.
73/3 ఓవర్ నైట్ స్కోరుతో మూడో టెస్టు… రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్… 344 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (134) సెంచరీతో చెలరేగాడు. టెయిలెండర్లు నోమన్ అలీ (45), సాజిద్ ఖాన్ (48 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ నాలుగు వికెట్లు తీశాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్… రెండో రోజు ఆట ముగిసే సమయానికి 24/3తో నిలిచింది. ఓపెనర్లు తక్కువ పరుగులకే వెనుదిరగగా.. జో రూట్ (5), హ్యారీ బ్రూక్ (3) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో నోమన్ అలీ రెండు వికెట్లు తీయగా… సాజిద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. దీంతో ఇంగ్లండ్ 53 పరుగుల వెనుకంజలో ఉంది.
మూడో టెస్ట్
మొదటి రోజు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ – 68.2 ఓవర్లలో 267/10
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ – 23.0 ఓవర్లలో 73/3
రెండో రోజు :
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ – 96.4 ఓవర్లలో 344/10
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ – 9.0 ఓవర్లలో 24/3 (53 పరుగుల వెనుకంజ)