Saturday, November 23, 2024

పాక్ కు ఎసిసి షాక్ -ఆసియా క‌ప్ అతిధ్య‌ హ‌క్కులు ర‌ద్దు..

దాయాది దేశం పాకిస్థాన్ కు భారీ షాక్‌ తగిలింది. ఆసియా కప్ క్రికెట్‌ టోర్నీ ఆతిథ్యం ఆ దేశం చేజారింది. ఈ టోర్నీని పాక్‌ నుంచి మరో చోటుకు తరలించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ ఏడాది ఆసియా కప్ -2023 క్రికెట్‌ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. పాక్ లో సెప్టెంబర్‌ 2న ఈ టోర్నీ ఆరంభం కానుంది. అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్‌లో జరిగే ఈ టోర్నీకి భారత జట్టును పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తేల్చి చెప్పింది. దీంతో తటస్థ దేశంలో భారత జట్టు తన మ్యాచ్‌లు ఆడే ప్రతిపాదనను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీబీసీ) తీసుకొచ్చింది. టోర్నీ పాక్‌లోనే జరిగినా భారత్‌ తన మ్యాచ్‌లను యూఏఈ లో ఆడే విధంగా ‘హై బ్రిడ్‌’ మోడల్ ను పీసీబీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను భారత్‌ సహా మిగిలిన దేశాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలోనే ఆసియాకప్‌ను వేరే దేశానికి తరలించాలని ఏసీసీ నిర్ణయించింది. టోర్నీ పాక్‌ చేజారడంతో ఈ ఏడాది ఆసియా కప్‌ను శ్రీలంక వేదికగా నిర్వహించే అవ‌కాశాలున్న‌ట్లు భావిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement