ఆసియా కప్ 2023ని తటస్థ వేదికపై ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పట్టుబట్టినట్లయితే బాబర్ అజామ్ నేత్సత్వంలోని జట్టు ప్రపంచ కప్ కోసం భారత్‌కు వెళ్లకూడదని పాకిస్థాన్ క్రీడా మంత్రి ఎహ్సాన్ మజారీ సూచించారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి, భారతదేశం తమ ఆసియా కప్ మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడాలని డిమాండ్ చేస్తే, మేము భారతదేశంలో జరిగే ప్రపంచ కప్ మ్యాచ్‌లకు కూడా అదే డిమాండ్ చేస్తాం” అని ఎహ్సాన్ మజారీ పేర్కొన్నారు.
భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాక్ ప్రధాని షె#హబాజ్ షరీఫ్ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మజారీ ప్రకటన వెలువడింది. ‘కమిటీకి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వం వ#హస్తారు. కమిటీలోని 11 మంది మంత్రుల్లో నేను కూడా ఉన్నాను. మేము ఈ సమస్యను చర్చించి, ప్రధానమంత్రికి మా సిఫార్సులను అందిస్తాము. దానిపై ఆయన తుది నిర్ణయం తీసుకుంటారు” అని కమిటీలో మజారీ తెలిపారు.