బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో… దక్షిణాఫ్రికా తొలి టెస్టులో విజయం సాధించింది. ఈరోజు (గురువారం) మిర్పూర్లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి తొలి టెస్టు మ్యాచ్ ను సొంతం చేసుకుంది.
ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో దక్షిణాఫ్రికా నాలుగో స్థానానికి ఎగబాకి… తమ డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాగా, 2014లో గాలేలో శ్రీలంకను ఓడించిన దక్షిణాఫ్రికా…. దాదాపు దశాబ్ద కాలం తరువాత ఆసియాలో తమ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.
తొలి రోజు :
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ – 40.1 ఓవర్లలో 106/10,
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ – 140/6.
రెండో రోజు :
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ – 88.4 ఓవర్లలో 308/10 (లీడ్ 202)
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ – 27.1 ఓవర్లలో 101/3
మూడో రోజు :
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ – 85.0 ఓవర్లలో 283/7
నాల్గో రోజు :
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ – 89.5 ఓవర్లలో 307/10 (లీడ్ 105)
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ – 22 ఓవర్లలో 106/3 పరుగులు. (ఏడు వికెట్ల తేడాతో విజయం)