ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజీవేంద్ర చాహల్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అవతరించాడు. ఈరోజు (సోమవారం) జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగున్న మ్యాచ్‌లో చాహల్ ఈ ఘనత సాధించాడు. 8వ ఓవర్లో ముంబై ప్లేయర్ మహ్మద్ నబీ (23)ని అవుట్ చేసి ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement