Friday, September 20, 2024

ఒక్క బ్యాడ్ గేమ్ రోహిత్ శర్మను చెత్త కెప్టెన్‌గా మార్చదు : గంభీర్

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ODI ప్రపంచ కప్ 2023లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా గొప్పగా రాణించాడని కితాబిచ్చాడు. 5 ఐపీఎల్ టైటిళ్లు నెగ్గడం సామాన్యమైన విషయం కాదని, రోహిత్ ప్రతిభాపాటవాలకు అది నిదర్శనమని తెలిపాడు.

వరల్డ్ కప్‌ ఫైనల్ మినహాయిస్తే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో రోహిత్ నాయకత్వంలో భారత్ ఆధిపత్యం చెలాయించిందని గంభీర్ వివరించాడు. భారత్ చాంపియన్‌లా ఆడిందని కొనియాడాడు. ఒక్క మ్యాచ్ (ఫైనల్)లో ఓడినంత మాత్రాన రోహిత్ చెత్త కెప్టెన్ అయిపోడని వ్యాఖ్యానించాడు. రోహిత్‌ను చెత్త కెప్టెన్ అని పిలిచినా, టీమిండియాను చెత్త జట్టు అని పిలిచినా అది సరికాదు అని గంభీర్ స్పష్టం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement