డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓవల్ మైదానంలో జరుగుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఆల్ అవుట్కావడంతో ఆసిస్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే.. తొలుత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఆసిస్ జట్టు 469 పరుగులు చేయగా.. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 296 పరుగులు చేసింది. ఇక.. ఆసిస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా కంటే 173 పరుగుల ఆధిక్యంలో ఉంది.. కాగా, సెకండ్ ఇన్సింగ్స్లో మూడో రోజు ఆటముగిసే సమయానికి ఆసిస్ నాలుగు వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కీలక విట్లు కోల్పోవడంతో మ్యాచ్ స్లో అయ్యింది. పరుగులు రాబట్టడంలో బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. ఇక.. రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు ఆసిస్ని కోలుకోలేని దెబ్బతీశారు. ఈ క్రమంలో ఉస్మాన్ ఖవాజా (13), డేవిడ్ వార్నర్ (1), స్టీవ్ స్మిత్ (34), ట్రావిస్ హెడ్ (18) పరుగులు మాత్రమే చేయగలిగారు. కాగా, స్పిన్నర్ రవీంద్ర జడేజాకు 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్కు తలా ఒక వికెట్ దక్కింది.