క్రీడా రంగంలో అత్యున్నతమైన ఈవెంట్‌గా భావించే ఒలింపిక్స్ సెషన్ 2023 భారత్‌లో ఏర్పాటు కానుంది. ముంబై దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. 40ఏళ్ల తరువాత భారత్‌లో ఈ సెషన్ ఏర్పాటు కాబోతుండటం ఎంతో సంతోషకరం అన్నారు. ఈ సెషన్స్ నిర్వహించడానికి అవసరమైన హక్కులను భారత్ సొంతం చేసుకోవడం శుభపరిణామం అన్నారు. భారత్‌లో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ దిశగా తొలి అడుగు పడినట్టు అయ్యిందని వ్యాఖ్యానించారు.
ఈ అత్యుత్తమ స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ సెషన్స్‌ను భారత్‌లో విజయవంతంగా నిర్వహించగలుగుతామనే నమ్మకం ఉందని, భవిష్యత్ తరాలకు ఇదో దిక్సూచిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. 1983లో తొలిసారి ఈ సెషన్స్ భారత్‌లో ఏర్పాటైంది. ఇది రెండోసారి. ముంబైలో ఐఓసీ సెషన్ నిర్వహణ కోసం అవకాశం ఇచ్చినందుకు నీతా అంబానీ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాది మందికి ఈ సెషన్స్ ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.