Sunday, September 8, 2024

Paris | ఒలింపిక్స్ లో కొవిడ్ క‌ల‌క‌లం…

పారిస్ ఒలింపిక్స్-2024 లో కోవిడ్ క‌ల‌క‌లం రేగింది . గత టోక్యో ఒలింపిక్స్‌ను ఏడాది పాటు ఆలస్యం చేసిన మహమ్మారి కొవిడ్ మరోసారి విశ్వక్రీడలకు ఆటంకం కలిగించేలా క్రమంగా విజృంభిస్తోంది. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఐదుగురు క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఆస్ట్రేలియా క్రీడాకారులకు కొవిడ్ సోకిందని అధికారులు తెలిపారు. వాటర్ పోలో మహిళల జట్టులో ఐదుగురికి కరోనా వచ్చిందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా బృందంలోని మిగిలిన వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే కరోనా బారిన పడిన ఆ ఐదుగురు కూడా క్షేమంగానే ఉన్నారని, అంతేగాక వాళ్లు తమ క్రీడల్లో పాల్గొంటారని అధికారులు స్పష్టం చేశారు.

కొవిడ్ కూడా ఇతర శ్వాసకోస సంబంధిత అనారోగ్యం వంటిదేనని, దాన్ని ముప్పుగా భావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం క్రీడాగ్రామంలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, క్రీడాకారులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. కరోనా కారణంగా గత టోక్యో ఒలింపిక్స్ కఠిన నిబంధనల మధ్య జరిగిన విషయం తెలిసిందే. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ కూడా ప్రత్యేక నిబంధనల మధ్య జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement