Wednesday, September 18, 2024

Olympics Hockey – సెమీస్ లో భారత్

హాకీలో ఘన విజయం

గ్రేట్ బ్రిటన్పై గెలుపు

షూటౌట్లో సత్తాచాటిన క్రీడాకారులు

పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త హాకీ జ‌ట్టు గ్రూప్ ద‌శ‌లో ఒక్క మ్యాచ్ మాత్ర‌మే ఓడిపోయి క్వార్ట‌ర్ ఫైన‌ల్ కు చేరుకుంది. క్వార్ట‌ర్ ఫైన‌ల్ భార‌త్-గ్రేట్ బ్రిట‌న్ త‌ల‌ప‌డ్డాయి. ఇరు జ‌ట్లు గెలుపు కోసం అద్భుతమైన ఆట‌తో పోరాడాయి.

- Advertisement -

భార‌త ప్లేయ‌ర్ శ్రీజేష్ ఏకంగా బ్రిట‌న్ ఆడిన 11 షాట్స్ లో 10 షాట్స్ ను ఆప‌డం విశేషం. నిర్ణీత 60 నిమిషాల పాటు భారత్, గ్రేట్ బ్రిటన్ అద్భుత పోరాటంతో 1-1తో సమంగా నిలిచాయి. దీంతో విజేత‌ను నిర్ణ‌యించ‌డానికి మ్యాచ్ షూటౌట్ కు చేరుకుంది.

కాగా.. భారత్ రెండో షూటౌట్ లో సుర్జీత్ కూడా గోల్ చేశాడు. దీంతో ఇరు జట్లు రెండేసి గోల్స్ తో సమంగా ఉన్నాయి. మూడో గోల్ షూటౌట్ లో గ్రేట్ బ్రిటన్ మిస్ చేసింది. భారత్ తరఫున లలిత్ ప్రదీప్ భారత్ కు మూడో గోల్ ను అందించాడు. దీంతో భారత్ 3-2 తో లీడ్ లోకి వచ్చింది. ఆ తర్వాత కూడా మరో గోల్ చేసి భారత్ 4-2 విజయాన్ని అందుకుంది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement