Monday, November 18, 2024

Olympics | చ‌లో.. చ‌లో పారిస్ ఒలింపిక్స్…

ఒలింపిక్స్ 2024 మరికొద్ది వారాల్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ట్రావెల్‌ బుకింగ్స్‌ భారీగా పెరినట్లు ఎయిర్‌ బీఎన్‌బీ తెలిపింది. తన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 90 శాతం వినియోగదారులు ఒలింపిక్స్‌ జరిగే ప్రదేశాల చుట్టూ ఉ‍న్న హోటల్స్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ నెల 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ఈసారి పారిస్‌ ఆతిథ్యం ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, అథ్లెట్లు, ఇతరులు ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే చాలా మంది ఒలింపిక్స్‌ జరిగే క్రీడా ప్రాంగణాల పరిసరాల్లోని హోటల్స్‌ను బుక్‌ చేసుకున్నారు.

ఈ మేరకు ఆతిథ్య రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ ఆన్‌లైన్‌ హోటల్‌ బుకింగ్‌ ప్లాట్‌పామ్‌ ఎయిర్‌ బీఎన్‌బీ ప్రకటన విడుదల చేసింది. ఒలింపిక్స్‌ జరిగే ఆక్వాటిక్స్‌ సెంటర్‌, బెర్సీ అరెనా, బార్‌డాక్స్‌ స్టేడియం, చాంప్‌ డే మార్స్‌ అరెనా, చాటూ డి వెర్సల్లీస్‌, చాట్రాక్స్‌ షూటింగ్‌ సెంటర్‌, ఈఫిల్‌ టవర్‌ స్టేడియం.. వంటి క్రీడా ప్రాంగాణాల పరిసరాల్లో హోటల్స్‌ పూర్తిగా బుక్‌ అయినట్లు తెలిపింది.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారుల్లో దాదాపు 90 శాతం మంది ఈ ఒలింపిక్స్‌ జరిగే ప్రాంతాల్లోని హోటల్స్‌ను సెర్చ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. భారత్‌, చైనా, హాంకాంగ్, జపాన్ నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఈసారి అత్యధిక పెరుగుదల కనిపిస్తుందని చెప్పింది.

భారతీయ ప్రయాణికులు పారిస్‌తోపాటు సమీపంలోని నైస్, ఆబర్‌విల్లియర్స్, కొలంబెస్, సెయింట్-ఓవెన్-సుర్-సీన్ వంటి ఇతర ప్రదేశాలను అన్వేషిస్తున్నారని తెలిపింది. ఇక పారిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల పరిసర ప్రాంతాల్లోని దాదాపు రూ.8,300 కోట్లు వ్యాపారం సాగుతుందని అంచనా. దీనివల్ల దాదాపు 7,300 మందికి ఉపాధి లభిస్తుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement