Thursday, September 5, 2024

Olympics 2024 | ఫుట్ బాల్ లో అర్జెంటీనాకు షాక్….

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. అయితే ఒలింపిక్స్ పోటీలు మాత్రం ఒక రోజు ముందు నుంచే మొదలయ్యాయి. ఫుట్‌బాల్, రగ్బీ సెవెన్స్ క్రీడలు ఆరంభమయ్యాయి. ఫుట్‌బాల్‌లో తొలి మ్యాచ్ అయిన మొరాకో-అర్జెంటీనా పోరు వివాదంగా మారింది. అభిమానులు మైదానంలో దూసుకొచ్చి రచ్చరచ్చ చేశారు.

దీంతో మ్యాచ్ దాదాపు రెండు గంటలపాటు ఆలస్యమైంది. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మ్యాచ్‌ను కొనసాగించారు. అయితే నాటకీయ పరిమాణాల మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో రెండు సార్లు స్వర్ణ పతక విజేత అర్జెంటీనాను మొరాకో 2-1 తేడాతో ఓడించింది. గ్రూప్-బీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత 2-2తో స్కోరు సమంగా భావించారంతా. కానీ ఆ తర్వాతే అసలు మలుపు తిరిగింది.

మొరాకో ప్లేయర్ రహిమి తమ జట్టుకు రెండు గోల్స్ అందించాడు. 45వ, 51 వ నిమషంలో గోల్ కొట్టాడు. మరోవైపు అర్జెంటీనా ఆలస్యంగా స్కోరు ఖాతాను ఆరంభించింది. 68వ నిమిషంలో సిమోన్ గోల్ సాధించాడు. ఆ తర్వాత మొరాకో తన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగింది. కానీ ఇంజ్యూరీ టైమ్‌లో అర్జెంటీనా ఆటగాడు క్రిస్టియన్ మెదినా గోల్ సాధించాడు. దీంతో స్కోరు 2-2తో సమం అయ్యింది.

కానీ అది సరైన గోల్ కాదని, మొరాకో అభిమానులు నిరసన తెలుపుతూ మైదానంలోకి వచ్చారు. అంతేగాక అర్జెంటీనా ఆటగాళ్లపై వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులు విసిరారు. దీంతో స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో అధికారులు మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్రేక్షకులందరినీ బయటకు పంపించారు.

మరోవైపు మ్యాచ్‌ను సస్పెంట్ చేశారని ఫిఫా వెబ్‌సైట్‌తో సహా ప్రముఖ వెబ్‌సైట్‌లు ప్రకటించాయి. కానీ ఆ తర్వాత మ్యాచ్‌ను కొనసాగించారు. అంతకుముందు అర్జెంటీనా చేసిన గోల్‌ను కౌంట్ చేయలేదు. అది ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది. అయితే మూడు నిమిషాలే మిగిలి ఉన్న ఆటలోఅర్జెంటీనా మరో గోల్ చేయలేకపోయింది. దీంతో 1-2తో మ్యాచ్‌ను కోల్పోయింది

- Advertisement -

స్పెయిన్ కు విజ‌యం..

గ్రూప్-సీలో జరిగిన మ్యాచ్‌ల్లో ఉజ్బెకిస్థాన్‌పై స్పెయిన్ 2-1తో గెలిచింది. స్పెయిన్‌ తరఫున పుబిల్‌ మార్క్‌ (29వ ని.), సెర్గియో (62వ ని.) గోల్స్‌ చేశారు. మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 2-1తో గినియాపై నెగ్గింది. ఈజిప్ట్-డొమినికన్‌ రిపబ్లిక్‌ మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement