ఒడిశా మాస్టర్స్ అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో జంట ఫైనల్స్‌కు చేరుకున్నారు. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో మ్యాచ్‌లో వరుస గేమ్‌ల 21-17, 21-13తో ఇండోనేషియా ద్వయం అర్ల్య నబిలా థీసా ముంగ్‌గారన్ –అగ్నియా శ్రీ రహాయును ఓడించారు. ఇక ఫైనల్‌లో మరో ఇండోనేషియా ద్వయం – మెయిలిసా ట్రియాస్ పుష్పితసరి -రాచెల్ అల్లెస్యా రోజ్‌తో తలపడనుంది భారత జోడీ.
ఇక, మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్‌లోనూ.. విజయం సాదించింది భారత్. డెన్మార్క్‌కు చెందిన మాడ్స్ వెస్టర్‌గార్డ్ – క్రిస్టీన్ బుష్‌ల తో తలపడిని తనీషా–ధృవ్ కపిల.. 21-14, 21-14 తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నారు.
పురుషుల సింగిల్స్ లో భారత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు అయూష్ శెట్టి, సతీష్ కుమార్ కరుణాకరన్‌లు సెమీఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ లో వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత అయూష్ శెట్టి.. శనివారం ముగిసిన మ్యాచ్‌లో 19-21, 21-14, 22-20 తేడాతో ఇండోనేషియాకు చెందిన అల్వి ఫర్హన్ ను ఓడించాడు. ఇదివరకే ముగిసిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్స్‌లో సతీష్ కుమార్.. ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో సతీష్.. భారత్‌కే చెందిన కిరణ్ జార్జ్‌ను ఓడించి ఫైనల్ చేరాడు.
ఇక పరుషుల డబుల్స్‌లో సెమీస్‌లోనూ .. భారత్‌కు చెందిన కృష్ణ ప్రసాద్ గరగా.కె – సాయి ప్రతీక్ జోడీ 21-17, 17-21, 21-18తో ఇండోనేషియా జోడీ అయిన టెగెస్ సత్రియాజీ – క్రిస్టోఫర్ డేవిడ్ జంటను ఓడించి పురుషుల డబుల్స్ ఫైనల్‌కు చేరుకుంది.