Tuesday, November 26, 2024

Cricket | వన్డే ప్రపంచ కప్‌.. అక్టోబర్‌ 15న పాక్‌ వర్సెస్‌ భారత్‌!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 మొదటి, ఫైనల్‌ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌లు తలపడనున్నాయి. ఇక భారత్‌ తన మొదటి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అక్టోబర్‌ 15న తలపడనుంది. ఈ మేరకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. ఐపీఎల్‌ తర్వాత అధికారిక షెడ్యూల్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌ కోసం భారత్‌లో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లీగ్‌ స్టేజ్‌లో పాకిస్థాన్‌ తన మ్యాచ్‌లను అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఆడనుంది.

బీసీసీఐ పాకిస్థాన్‌ మ్యాచ్‌లను ఎక్కువగా దక్షిణ భారతంలో నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. వన్డే వరల్డ్‌ కప్‌ మొత్తం 12వేదికలపై జరగనుంది. వాంఖడేలో సెమీ ఫైనల్‌ నిర్వహించనున్నారు. ప్రతి టీం 9 లీగ్‌ మ్యాచులు ఆడుతుంది. వరల్డ్‌ కప్‌లో మొత్తం 10 టీంలు 48 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 8 టీంలు నేరుగా వరల్డ్‌ కప్‌నకు క్వాలిఫై అవుతాయి. ఈ 8 టీంలు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. మిగిలిన రెండు స్థానాల కోసం జూన్‌ జులైలో లీగ్‌ మ్యాచ్‌లను జింబాబ్వేలో నిర్వహిస్తారు. ఈ లీగ్‌లో శ్రీలంక, వెస్టీండీస్‌తో పాటు నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌, నేపాల్‌, ఒమన్‌, స్కాంట్లాండ్‌, యూఏఈ, జింబాబ్వే పోటీపడుతాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement