ఐర్లాండ్ మహిళల జట్టుతో భారత్ మహిళల జట్టు మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. కాగా, స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌కు బీసీసీఐ తాజాగా జట్టును ప్రకటించింది. ఈ వన్డే సిరీస్ కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ… కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌లకు విశ్రాంతినిచ్చింది.
ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టనుంది. ఆల్ రౌండర్ దీప్తిశర్మ ఈ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
భారత మహిళల జట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్, సయాలీ సత్ఘరే.
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే !
కాగా, ఈ సిరీస్ ఈనెల (జనవరి) 10 నుంచి ప్రారంభం కానుండగా.. ఈ మూడు వన్డే మ్యాచులు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరగనున్నాయి
తొలి వన్డే – జనవరి 10న.
రెండో వన్డే – జనవరి 12న.
మూడో వన్డే – జనవరి 15న.