Tuesday, November 26, 2024

ODI Series: కెప్టెన్ ఎవరు.. సెలెక్టర్ల డిస్కషన్..

ప్ర‌భ‌న్యూస్ : వ‌న్డే సిరీస్‌కు కెప్టెన్ ఎవరు అనేదానిపై బీసీసీఐ చ‌ర్చిస్తోంది. వన్డే కెప్టెన్సీపై నిర్ణ‌యం తీసుకునే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో చర్చించాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం కోహ్లీ భారత జట్టుకు వన్డే కెప్టెన్‌గా ఉండగా, టీ20ల్లో రోహిత్ నాయకత్వం వహిస్తున్నాడు. విరాట్ కెప్టెన్‌గా రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత.. రోహిత్ శర్మ T20 క్రికెట్ ఫార్మాట్‌లో కెప్టెన్ పాత్రను చేపట్టాడు. రెండు వైట్-బాల్ ఫార్మాట్‌లకు ఇద్ద‌రు క‌ప్టెన్ లు ఉండ‌టం అంతర్జాతీయ జట్టుకు చాలా అరుదు. కానీ, ODI మరియు T20 ఫార్మాట్‌లలో ఒకే వ్యక్తి టీమ్ కు క‌ప్టెన్ గా ఉండాల‌ని చాలా మంది కోరుకున్నందున సెలెక్టర్ల పరిస్థితి కొంచం క‌ష్టంగానే మారింద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

భారత్ క్రికెట్ టమ్ 3 మ్యాచ్‌ల ODI సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టూర్ కి సిద్ధంగా ఉన్నందున, దాంతో.. 3 టెస్ట్‌లతో పాటు ODI కెప్టెన్సీ విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ విషయాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకుంది. సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకునే ముందు కోహ్లి మరియు రోహిత్ తో చర్చించనున్నారు. కెప్టెన్సీ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వన్డే సిరీస్‌కు జట్టును నిర్ణీత సమయంలో ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement