Friday, November 22, 2024

ఉప్పల్ లో వన్డే మ్యాచ్.. ప్లేయ‌ర్ల‌కి ఇబ్బంది క‌లిగిస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. పోలీస్ కమిషనర్ డీసీ చౌహన్

క్రికెట్ మ్యాచ్ ఉన్న నేప‌థ్యంలో ఉప్ప‌ల్ స్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయ‌న్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ డీసీ చౌహన్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగే ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్ కు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యాచ్ కు 2500 మందితో భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతిస్తామని చెప్పారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి సమస్య, ఇబ్బంది కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

ఈసారి ఎంట్రీ, ఎగ్జిట్ – బోర్డులు పెట్టామన్నారు. ఆటగాళ్లు వచ్చే గేట్ నుంచి బయటి వ్యక్తులకు ఎవరికి ఎంట్రీ లేదన్నారు. ప్లేయర్స్ కు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మ్యాచ్ సమయంలో గ్రౌండ్ లోకి ఎవరైనా వెళ్లే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. మహిళల కోసం ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. అమ్మాయిల పట్ల ఎవరైనా దురుసు ప్రవర్తన చేస్తే చర్యలు తప్పవన్నారు. బ్లాక్ లో టికెట్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీ గేట్ దగ్గర సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఉంటుందని డీసీపీ రక్షిత చెప్పారు. గేట్ నెంబర్ 1 నుంచి వీఐపీలకు మాత్రమే అనుమతి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement