హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం భారత్, భారత్ అంటూ హోరెత్తిపోయింది. భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ ఫ్యాన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచింది. ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమైన దశలో బ్రేస్‌వెల్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బంతికి ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో 337 రన్స్‌కు కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. శుభ్‌మన్ గిల్ సిక్సర్లతో విరుచుకుపడి డబుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ శతకం బాదాడు. మ్యాచ్ చేజారినా కూడా అభిమానులకు కావాల్సినంత మజా దొరికింది. ఫిన్ అలెన్ (40) రాణించారు.
136 కే 6 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను బ్రేస్‌వెల్, శాంటర్న్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ రికార్డు స్థాయిలో ఏడో వికెట్‌కు 162 రన్స్ చేశారు. చివర్లో లోకల్ బాయ్ సిరాజ్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి గెలుస్తాం అనే కివీస్ ఆశలను దెబ్బకొట్టాడు. అయితే.. సిరాజ్ ఈ క్రమంలో హ్యాట్రిక్ మిస్సయ్యాడు. 46వ ఓవర్ నాలుగో బంతికి మరోసారి 4 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి బంతికి షిష్లే వెనుదిరిగాడు. హ్రట్రిక్ బంతిని ఫెర్గూసన్ అడ్డుకున్నాడు. కుల్దీప్, శార్దూల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. షమీ, పాండ్యాకు ఒక్కో వికెట్ దక్కింది.
శుభ్‌మన్ డబుల్ సెంచరీ..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 145 బంతుల్లో రెండొందలు సాధించాడు. ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన అతను వన్డేల్లో తొలి ద్విశతకం బాదాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్‌లు బాది డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 208 పరుగులకు గిల్ అవుట్ అయ్యాడు. వెనుదిరిగాడు. రోహిత్ శర్మ (34), విరాట్ కోహ్లీ (8), ఇషాన్ (5) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. భారత్ భారీ స్కోర్ చేసిందంటే అందుకు కారణం గిల్.. సూర్యకుమార్, పాండ్యాతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు.
ధోనీ సరసన బ్రేస్‌వెల్..
సెంచరీతో చెలరేగిన బ్రేస్‌వెల్, భారత మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రెండు సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతేకాదు న్యూజిలాండ్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు