ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తడబడుతోంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు భానుక రాజపక్స (71 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో 170 పరుగులు చేసింది. టార్గెట్ చేజింగ్‌లో పాకిస్తాన్‌ను లంక యువపేసర్ ప్రమోద్ మదుశన్ పెద్ద దెబ్బకొట్టాడు. తను వేసిన తొలి ఓవర్లోనే బాబర్ ఆజమ్ (5), ఫకర్ జమాన్ (0) ఇద్దరినీ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో పాకిస్తాన్‌పై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే మహమ్మద్ రిజ్వాన్ ఆచితూచి ఆడుతున్నాడు. (47 నాటౌట్) అతనితోపాటు ఇప్పటిదాకా ఆడిన ఇఫ్తికార్ అహ్మద్ (33) డ్రింక్స్ బ్రేక్ తర్వాత 12వ ఓవర్లో అవుటయ్యాడు. దీంతో పాకిస్తాన్ జట్టు పవర్‌ప్లే ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేసింది. ఇంకా 35 బంతుల్లో 72 పరుగులు చేయాల్సి ఉంది.