వింబుల్డన్ జకోవిచ్ జోరు కొనసాగుతోంది. సింగిల్స్ విభాగంలో ఈ సెర్బియా స్టార్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. కెవిన్ అండర్సన్ తో నిన్న జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–3తో గెలుపొందాడు. గంటా 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఎదుర్కోలేదు. తొమ్మిది ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు పదిసార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచాడు. అండర్సన్ 26 అనవసర తప్పిదాలు చేయగా… జొకోవిచ్ ఆరు మాత్రమే చేశాడు.
మహిళల సింగిల్స్ విజయానికి వస్తే రెండో సీడ్ గా బరిలోకి దిగిన బెలారస్ క్రీడాకారిణి సబలెంకా మూడవ రౌండ్ లోకి ప్రవేశించింది. ఇదే సమయంలో టాప్-10లోని పలువురు ఓటమి పాలయ్యారు. అమెరికాకు చెందిన నాలుగో సీడ్ సోఫియా కెనిన్, కెనడాకు చెందిన ఐదో సీడ్ బియాంక, స్విట్జర్లాండ్ కు చెందిన బెలిండా బెన్ చిచ్ లు ఓడిపోయారు. వీరిని ఓడించిన వారంతా టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ప్రపంచంలో ఇప్పటివరకూ అంతగా పేరు తెచ్చుకోనివారే కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి:ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: టాప్‌లోకి కేన్ విలియమ్సన్..