Saturday, January 25, 2025

ICC టీమ్ లో ఇండియ‌న్స్ కు నో ఛాన్స్ !

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యుత్తమ వన్డే క్రికెట్ జట్టును ప్రకటించింది. వన్డే క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రతి సంవత్సరం అత్యుత్తమ జట్టును ప్రకటిస్తుంది. కాగా, ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 జట్టు వివరాలను శుక్రవారం వెల్లడించింది.

అయితే, ఈ జట్టులో భారత్‌ నుంచి ఒక్క ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేదు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ అగ్రశ్రేణి జట్లకు చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో గతేడాది భారత్‌తో సహా ప్రధాన టీమ్స్.. ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడలేదు. దాంతో ప్రధాన జట్ల ఆటగాళ్లు అత్యుత్తమ వన్డే టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయారు.

ఈ క్రమంలో, శ్రీలంక నుండి అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లో ఎంపికయ్యారు. ఈ అత్యుత్తమ వన్డే జట్టులో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు, అఫ్ఘనిస్థాన్‌కు చెందిన మరో ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. వెస్టిండీస్ నుండి ష్రెఫెన్ రూథర్‌ఫోర్డ్ మాత్రమే ఎంపికయ్యాడు.

ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 ఇదే !

సయీమ్ ఆయుబ్ (పాకిస్థాన్), రెహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్), పాతుమ్ నిస్సంక (శ్రీలంక), కుశాల్ మెండీస్ (వికెట్ కీప‌ర్) (శ్రీలంక), చరిత్ అసలంక కెప్టెన్ (శ్రీలంక), ష్రెఫెన్ రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గానిస్థాన్), వానిందు హసరంగా (శ్రీలంక), షాహిన్ షా అఫ్రిది (పాకిస్థాన్), హ్యారీ రౌఫ్ (పాకిస్థాన్).

- Advertisement -

టెస్టు జట్టులో టీమిండియా నుంచి ముగ్గురు !

వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 ప్రకటించిన కొద్దిసేపటికే, అత్యుత్తమ టెస్ట్ జట్టు వివరాలను ప్రకటించింది ఐసీసీ. గతేడాది టెస్ట్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ అత్యుత్తమ జట్టు‌ను ప్రకటించింది.

ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 లో భారత్ నుంచి ఒక్క ఆటగాడు కూడా ఎంపిక కాలేదు.. అయితే, టెస్టు జట్టులో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ యార్క‌ర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఐసిసి టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024కి ఎంపికయ్యారు. అయితే, ఈ జ‌ట్టులో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అవకాశం దక్కలేదు.

ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024:

యశస్వి జైస్వాల్ (ఇండియా), బెన్ డక్కెట్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), కామిందు మెండీస్ (శ్రీలంక‌), జేమీ స్మిత్ (వికెట్ కీపర్) (ఇంగ్లండ్), రవీంద్ర జడేజా (ఇండియా), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), మ్యాట్ హెన్రీ (ఆస్ట్రేలియా), జస్‌ప్రీత్ బుమ్రా (ఇండియా).

Advertisement

తాజా వార్తలు

Advertisement