తెలంగాణకు చెందిన భారత మహిళా బాక్సర్ నిఖత్ ఆసియా గేమ్స్ కు అర్హత సాధించింది. సోమ వారం ఢిల్లిdలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ట్రయల్స్‌లో నిఖత్ (51కిలోలు), మనీషా (57కేజీలు), జాస్మిన్ (60కేజీలు), లవ్లీనా (69కేజీ లు), సావేటీ బూరా (75కేజీలు) అర్హత సాధించారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్‌ను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి అభినందించారు.
సెప్టెంబర్ 10 నుంచి 25వరకు చైనాలో జరిగే ఆసియాగేమ్స్‌కు 51కేజీల విభాగంలో నిఖత్ అర్హత సాధించడం.. తెలంగాణతోపాటు భారతదేశానికి గర్వకారణమన్నారు. తెలంగాణ నుంచి 2022 ఏషియన్ గేమ్స్‌కు అర్హత సాధించిన తొలి క్రీడాకారిణి నిఖత్ జరీన్ అన్నారు. నిఖత్ రాబోయేరోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని అల్లిపురం తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..