ఐపీఎల్ సీజన్ 14 సెకండ్ భాగం సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఆసమయంలో అంతర్జాతీయ జట్లు మ్యాచ్ లు ఆడుతూ బిజీబజీగా గడపనున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు వేరే జట్లతో మ్యాచ్ లు ఆడవలసి ఉంది. దీంతో ఐపీఎల్ లీగ్ కు ఫారన్ ప్లేయర్ల కల తప్పినుందని అందరూ భావించారు. కాని ఐపీఎల్ 2021 రెండో అంచెలో పాల్గొనేందుకు తమ క్రికెటర్లకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో విలియమ్సన్ (సన్‌రైజర్స్), బౌల్ట్ (ముంబై ఇండియన్స్), జేమీసన్ (బెంగళూరు), సాట్నర్ (చెనై సూపర్ కింగ్స్) తరఫున బరిలోకి దిగనున్నారు. వాస్తవానికి ఐపీఎల్ జరిగే సమయంలో న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్… పాకిస్తాన్‌తో మూడు వన్డేలతో పాటు ఐదు టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌ల నుంచి ఐపీఎల్‌లో ఆడే ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. అంతేకాకుండా టి20 ప్రపంచకప్, భారత్‌తో జరిగే టి20 సిరీస్‌ల కోసం కేన్ విలియమ్సన్ నాయకత్వంలో ఒక జట్టును… బంగ్లాదేశ్, పాక్‌లతో ఆడేందుకు టామ్ లాథమ్ సారథ్యంలో మరొక జట్టును ప్రకటించారు.
ఇది కూడా చదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?