Tuesday, November 26, 2024

ఆఫ్గాన్‌పై న్యూజిలాండ్ గెలుపు.. భారత్ ఆశలు గల్లంతేనా?

టీ20 వరల్డ్ కప్‌ లో భాగంగా అఫ్గాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచింది. స్వల్ప స్కోరుకే ఆఫ్గాన్‌ ఇన్నింగ్స్ ముగించింది. భారత అభిమానులు కివీస్ ఓటమి కోసం ఆశగా ఎదురుచూసినా అటువంటి అవకాశమే లేకుండా పోయింది. ఆఫ్గానిస్తాన్ జట్టు కేవలం 124పరుగులు మాత్రమే చేసింది. కివీస్ జట్టుకు స్వల్ప లక్ష్యం నిర్దేశించడంతో కివీస్ విజ‌యం ఈజీ అయ్యింది.

టీ20 వరల్డ్ కప్‌లో 40వ మ్యాచ్ ఇది కాగా.. ఈ మ్యాచ్‌ అబుదాబీలో జరుగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గాన్‌ కెప్టెన్ మహ్మద్ నబీ మొదట బ్యాటింగ్ ఎంచుకుని న్యూజిలాండ్‌ని బౌలింగ్‌కి ఆహ్వానించాడు. నజీబ్ జద్రాన్ హాఫ్ సెంచరీ(73) చేయడంతో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది.

ఓపెనర్లు షెహజాద్‌(4), జజాయ్‌ (2), రహ్మనుల్లా (6) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాసేపు నిలబడిన గుల్బాదిన్‌ నైబ్‌ (15) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఓపెనర్లు, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అవుట్ అవడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఇదే సమయంలో క్రీజ్‌లో ఉన్న నజిబుల్లా జద్రాన్‌ (73)తో ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ ఓట‌మితో ఇండియా సెమీస్ ఆశలు గల్లంతయినట్లేన‌ని, న్యూజిలాండ్ నేరుగా సెమీస్‌కి వెళ్లిపోతుంద‌ని క్రికెట్ అన‌లిస్టులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement