అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఇటలీలోని వెరోనాలో మంగళవారం జరిగిన యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో లిథువేనియాకు చెందిన 41 ఏళ్ల అలెగ్జాండర్ సోరోకిన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 24 గంటల్లో అతను 319.614 కిలోమీటర్ల దూరం పరిగెత్తి మునుపటి రికార్డును బ్రేక్ చేశాడు. 40 ఏళ్ల అలెగ్జాండర్ సగటున కిలోమీటర్ దూరాన్ని 4.30 నిముషాల్లో అధిగమిస్తూ ముందుకుసాగాడు. ఇంతకు ముందు కూడా వేగవంతమైన సుదూర రన్ రికార్డు అతనిపేరిటే ఉండేది.
గతేడాది ఆగస్టులో 24 గంటల్లో 303.506 కి.మీ. దూరం పరుగెత్తాడు. ఇప్పుడు ఆ రికార్డును తానే తిరగరాసుకున్నాడు. కొత్త రికార్డు గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. చాలా అలసిపోయాను. కానీ రికార్డుతో డబుల్ ఆనందంతో ఉన్నా.. సాధారణంగా ప్రపంచ రికార్డు అంటేనే గొప్ప సంతోషం. అలాంటిది నా రికార్డును నేనే బ్రేక్ చేయడం రెట్టింపు ఆనందాన్నిచ్చింది అని తెలిపాడు. ఈ పోటీల్లో పోలాండ్‌కు చెందిన అథ్లెట్ పియోట్రోస్కీ 303.858 కి.మీ దూరం పరిగెత్తి రెండవ స్థానంలో నిలవగా, ఇటలీకి చెందిన మార్కో విసినిటీ 288 కి.మీతో మూడవ స్థానం దక్కించుకున్నాడు.