రెండేళ్ల పాటు 7.5 శాతం స్థిర వడ్డీ రేటుతో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2023లో బుధవారం ప్రకటించారు. ఈ స్కీంలో డిపాజిట్ మహిళ లేదా బాలిక పేరు మీద చేసేందుకు వీలుంటుంది. గరిష్ట డిపాజిట్ మొత్తం రూ. 2 లక్షల వరకూ ఉంటుంది. అంతేకాక, స్కీమ్‌లో పాక్షిక ఉపసంహరణ సౌకర్యం కూడా ఉంటుంది. స్కీమ్ ప్రకారం మహిళ లేదా బాలిక పేరు మీద 7.5 వడ్డీ రేటుతో రెండేళ్లకు పరిమితికి గాను ఉంటుందని సీతారామన్ తెలిపారు. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద మహిళల ఆర్థిక స్వాలంబన కోసం గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేయడం ద్వారా 81 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసినట్లు ఆర్థికమంత్రి తెలిపారు.
ఈ సమూహాలను అనేక వేల మంది సభ్యులతో కూడిన భారీ నిర్మాత సంస్థలు లేదా సమిష్టిగా ఏర్పడటం ద్వారా ఆర్థిక సాధికారత తదుపరి దశకు చేరుకోవడానికి వీలు కల్పిస్తామన్నారు. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి కింద చిన్న రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఆర్థిక సహాయం అందించామన్నారు. ఈ పథకం కింద 3 కోట్ల మంది మహిళా రైతులకు రూ. 54,000 కోట్లు అందించామని సీతారామన్ తెలిపారు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్)లో పెట్టుబడి పెట్టగల గరిష్ట మొత్తాన్ని ఇప్పుడు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. పోస్టల్ నెలవారీ ఆదాయ పథకం కూడా పరిమితిని పెంచింది. ఇప్పుడు పరిమితిని రూ.4,5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. అధిక ద్రవ్యోల్బణం సమయంలో సాధారణ ఆదాయం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు పరిమితుల పెరుగుదల ఓదార్పు నిస్తుంది. పథకాలకు సార్వభౌమాధికారం మద్దతు ఉండటం వలన క్రెడిట్ రిస్క్ ఉండదు.