ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారిగా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1972 నుంచి ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న భారత మహిళల జట్టుకు ఆసియా టీటీ ఛాంపియన్‌షిప్‌లో ఇదే తొలి మెడల్ కావడం విశేషం. కజాకిస్తాన్‌లోని ఆస్తానా వేదికగా బుధవారం జరిగిన సెమీస్ పోరులో భారత్ 1-3 తేడాతో జపాన్ చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకుంది.
మరోవైపు పురుషుల విభాగంలోనూ భారత జట్టు పతకాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 3-1 తేడాతో కజాకిస్తాన్‌పై విజయం సాధించి సెమీస్‌లో ప్రవేశించింది.