Friday, November 22, 2024

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై నీరజ్‌ దృష్టి

గాయం నుండి తిరిగి వచ్చినప్పుడు అగ్రశ్రేణి పోటీదారులను ఎదుర్కోవడం ఎప్పుడూ కఠినమైన సవాలే. జావెలిన్‌ త్రోలో భారతదేశ ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాది కూడా ఇదే పరిస్థితి. రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై అతడు దృష్టిసారించాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌ నేషనల్‌ అథ్లెటిక్స్‌ సెంటర్‌లో ఆగస్టు 19 నుండి 27 వరకు జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు శారీరకంగా, మానసికంగా తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు.

డైమండ్‌ లీగ్‌ విజేతగా చోప్రా బుడాపెస్ట్‌కు వైల్డ్‌ కార్డ్‌ ద్వారా అర్హత సాధించాడు. ”రాబోయే కొన్ని వారాలపాటు నా దృష్టి బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లపై కేంద్రీకృతమవుతుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడం ముఖ్యం. ఇప్పటికైతే ఫిజియో అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు నా సన్నాహాలు పూర్తిస్థాయిలో కొనసాగుతాయి” అని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఐ) సోమవారం నిర్వహించిన ఇంటరాక్షన్‌లో నీరజ్‌ తెలియజేశాడు.

- Advertisement -

మే 5న దోహాలో జరిగిన ఓపెనింగ్‌ డైమండ్‌ లీగ్‌ ఈవెంట్‌ లో తన కెరీర్‌లో నాల్గవ త్రో 88.67 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచి సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. కానీ అలా చేయడం వలన, అతను కండరాల ఒత్తిడికి గురయ్యాడు. దాంతోముందు జాగ్రత్త చర్యగా జూన్‌ 4న హెంగెలో (నెదర్లాండ్స్‌)లో జరిగే ఎఫ్‌బికె గేమ్స్‌, జూన్‌ 13న ఫిన్‌లాండ్‌లోని తుర్కులో జరిగే పావో నుర్మి గేమ్స్‌ నుంచి వైదలగాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement