Wednesday, November 13, 2024

కామన్వెల్త్‌ గేమ్స్ నుంచి నీరజ్‌ ఔట్‌.. గాయంతో వైదొలగిన చోప్రా..

జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం ఖాయమనుకుంటున్న తరుణంలో భారత్‌కు ఊహించనిన షాక్‌ తగిలింది. గాయం కారణంగా మహా క్రీడా కుంభమేళా నుంచి చోప్రా వైదొలగాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, ఇటీవల వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో రజతం సాధించి జోరు మీదున్న నీరజ్‌పై భారత్‌ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ గాయం కారణంగా నీరజ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి రాజీవ్‌ మెహతా వెల్లడించారు. ”కామన్వెల్త్‌ గేమ్స్‌-2022లో నీరజ్‌ చోప్రా పాల్గొనడం లేదు.

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ తుది పోటీల సమయంలో చోప్రా గాయపడ్డాడు. దీంతో అతడు పూర్తి ఫిట్‌గా లేడు. దీని గురించి అతడే అసోసియేషన్‌కు సమాచారం అందించాడు” అని రాజీవ్‌ మెహతా తెలిపారు. ఇటీవల వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో ఫైనల్‌లో నీరజ్‌ చోప్రా బరిసెను విసిరే క్రమంలో అతడి తొడ కండరాలు పట్టేశాయి. దాంతోనే జావెలిన్‌ త్రోలో ఇబ్బంది పడ్డానని ఫైనల్స్‌ అనంతరం చోప్రా వెల్లడించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement